రెండో టీ20కి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో టీ20లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు మా జట్టు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ఉదారంగా పరుగులు ఇచ్చారు.

తిరువనంతపురం: రెండో టీ20కి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా రెండో టీ20లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకు మా జట్టు ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ఉదారంగా పరుగులు ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి సారించారు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన భారత్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. కానీ ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పరుగులు చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో బ్యాట్‌ను షేక్ చేయాలని భావిస్తున్నారు. గత మ్యాచ్ లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమై ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఈసారి సత్తా చాటాలని భావిస్తోంది.
కానీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రసారమయ్యే స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్ స్టార్‌లలో ఈ మ్యాచ్‌లు రావడం లేదు. దీంతో చాలా మంది అభిమానులు భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లను ఎక్కడ చూడాలో తెలియడం లేదు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లను టీవీ, స్పోర్ట్స్ 18 మరియు కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్‌లలో చూడవచ్చు. కానీ ఈ ఛానెల్‌లు అన్ని రకాల DTH లలో ఉచితంగా అందుబాటులో లేవు. అందువల్ల, కొన్ని DTH లలో, మీరు వీటి కోసం విడిగా రీఛార్జ్ చేసుకోవాలి. మీరు దీన్ని OTTలో చూడాలనుకుంటే, మీరు దీన్ని Jio సినిమా యాప్‌లో చూడవచ్చు. జియో సినిమా కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జియో సిమ్ యూజర్ అయితే మరియు మొబైల్ రీఛార్జ్ కలిగి ఉంటే, జియో సినిమా యాప్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీంతో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా.. మూడో టీ20 ఈ నెల 28న, నాలుగో టీ20 డిసెంబర్ 1న, ఐదో టీ20 మ్యాచ్ 3న జరగనుంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-26T08:35:04+05:30 IST