గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మొదటి సినిమా ‘ఉప్పెన’తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన తదుపరి చిత్రానికి నేషనల్ అవార్డ్ గెలుచుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేతులు కలిపాడు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ మూవీ ఆర్‌సి16 సాంకేతిక ప్రమాణాల పరంగా అత్యున్నతంగా ఉండబోతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్, సుకుమార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో తన తదుపరి చిత్రం కోసం చేతులు కలిపాడు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ మూవీ ఆర్‌సి16 సాంకేతిక ప్రమాణాల పరంగా అత్యున్నతంగా ఉండబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే… ఈ మెగా వెంచర్ కు ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. అయితే రెహమాన్ ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటిస్తే, తాజాగా ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బుచ్చిబాబు ఉప్పెన మ్యూజికల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండో సినిమా కూడా మ్యూజికల్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయం.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ ఒకరు. దేశవ్యాప్తంగా సంగీత ప్రియులలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెహమాన్ సంగీతం విశ్వవ్యాప్తం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ కోసం బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్‌తో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇది కూడా చదవండి:
====================
*నవాజుద్దీన్ సిద్ధిఖీ: విక్టరీ వెంకటేష్ నుంచి అందరూ నేర్చుకోవాలి
*******************************
*ధనుష్: సోషల్ మీడియాతో జాగ్రత్త!
*******************************
*RC16: రామ్ చరణ్ ‘RC16’ ట్రెండింగ్.. ఎందుకో తెలుసా?
****************************
*కన్నప్ప: ‘కన్నప్ప’తో ఆ కల కూడా నెరవేరుతోంది..
****************************
నవీకరించబడిన తేదీ – జనవరి 06, 2024 | 06:01 PM