సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ, లైకా ప్రొడక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది.
‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయింది. అంతే కాకుండా ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేసిన ‘బాషా’ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. ఇందులో మైనుద్దీన్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. మంచి క్రికెటర్లు, స్నేహితులు అయిన హిందూ, ముస్లిం యువకులు తాము ఎంతగానో ఇష్టపడే క్రికెట్ ఆటపై మతం పేరుతో గొడవ పడుతుంటే, మొయిద్దీన్ భాయ్ ఆ గొడవలు ఎలా తీర్చాడు? ప్రజల మధ్య ఐక్యత నెలకొల్పడమే ‘లాల్ సలామ్’ సినిమా ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. (లాల్ సలామ్ విడుదల తేదీ)
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ అందించగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
====================
*ఆషికా రంగనాథ్: ‘నా సమిరంగ’లో నేను రెబల్..
****************************
*కత్రినా కైఫ్: చెన్నై నా రెండో ఇల్లు
****************************
*గుంటూరు కారం: ‘గుంటూరు కారం’కి ‘కీర్తికిరీటాలు’ నవల పోలిక.. నాగవంశీ స్పందన ఇదీ..
****************************
నవీకరించబడిన తేదీ – జనవరి 09, 2024 | 07:26 PM