బెంగళూరు: ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. బుధవారం జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మూడో టీ20లో విజయమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. చివరి మ్యాచ్‌లో గెలిచి టీమ్ ఇండియా క్వీన్ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే.. టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఈ జాబితాలో ప్రస్తుతం పాక్‌తో పాటు టీమిండియా తొలి స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 8 టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేస్తే పాకిస్థాన్ రికార్డు బద్దలవుతుంది. అత్యధికంగా 9 టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత జట్టు అవతరిస్తుంది.
2015లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత జట్టు తొలిసారిగా 3-0తో క్లీన్ స్వీప్ చేయగా.. ఆ తర్వాత 2017లో శ్రీలంకతో సిరీస్, 2018లో వెస్టిండీస్‌తో సిరీస్, 2019లో వెస్టిండీస్‌తో సిరీస్, న్యూజిలాండ్‌తో సిరీస్ 2019/20, 2021లో న్యూజిలాండ్‌తో సిరీస్, 2021లో వెస్టిండీస్‌తో సిరీస్, 2021లో శ్రీలంకతో సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. 2019/20లో న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ని 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. మిగతా అన్ని సిరీస్‌లను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా భారత జట్టు ఇప్పటికే స్వదేశంలో వరుసగా 15 టీ20 సిరీస్‌లను అజేయంగా కైవసం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాక్ రికార్డును తాజాగా టీమిండియా బద్దలు కొట్టింది. ప్రస్తుతం టీ20లో భారత్ 140 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 135 విజయాలు సాధించింది.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి