– సిరుగుప్పలో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుకు కమ్మసంఘం గౌరవాధ్యక్షుడు కొల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
సిరుగుప్ప (బెంగళూరు): అలుపెరగని మహానాయకుడు చంద్రబాబునాయుడుకు అండగా ఉంటామని సిరుగుప్ప కమ్మసంఘం గౌరవాధ్యక్షులు కొల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సిరుగుప్ప పట్టణానికి వచ్చిన ఏపీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావుకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ తాను కర్ణాటకలోని కార్వార్‌లో చదివానన్నారు. బళ్లారికి చెందిన ముల్లంగి చౌదరితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. జగన్ ను సీమ్ పీఠం నుంచి తప్పించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపునకు సరిహద్దు ప్రాంత ఆంధ్రులు కృషి చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా చరిత్ర చెరిగిపోయిందని విమర్శించారు. కృష్ణా జిల్లాకు పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి, తుంగభద్ర విషయంలో ఏపీ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడం లేదని విమర్శించారు. తెలుగుదేశం విద్యార్థి సంఘం ప్రతినిధి పొట్లూరి దర్శిత్ మాట్లాడుతూ ఉద్యోగాలు లేక అనేక మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యేలెవరూ రూ. 500 కోట్ల ఆదాయం కాదు శ్యామ్ జగన్ దగ్గర రూ. 510 కోట్ల ఆదాయం వచ్చిందని విమర్శించారు. రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజలకు మరువలేని సేవలు చేసి ఉంటే, వారందరినీ తుంగలో తొక్కిన సీయం జగన్ అధికార పీఠం నుంచి తప్పుకుంటే అందరూ ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి. సిరుగుప్ప కమ్మసంఘం సభ్యులు కొల్లి అరుణ, కొల్లి సుగుణ, తాలూకా అధ్యక్షులు జాలాది రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు తాతినేని ప్రసాద్, ప్రతాప్ చౌదరి, మాజీ అధ్యక్షులు కోనేరు గోపాలకృష్ణ, రమేష్ బాబు, చౌదరి, పదాధికారులు మురళి, గణేష్ రావు, ప్రసాద్, రఘుకిరణ్, కమ్మ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. .