ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కెనడాకు చెందిన ఓ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో కెనడాకు భారత్ సహకరిస్తోందన్నారు.

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో.. కెనడాకు చెందిన ఓ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో కెనడాకు భారత్ సహకరిస్తోందన్నారు. ఈ మేరకు మాజీ జాతీయ భద్రత & ఇంటెలిజెన్స్ సలహాదారు జోడీ థామస్ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల తన పదవి నుండి రిటైర్ అయ్యి హర్దీప్ నిజ్జర్ హత్య గురించి మీడియాతో మాట్లాడారు.
“హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పూర్తిగా సహకరిస్తోంది. ఈ కేసు కారణంగా దెబ్బతిన్న భారత్-కెనడా మధ్య సంబంధాలు మళ్లీ పురోగమిస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఈ కేసును పరిష్కరించేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తోంది. కేసు దర్యాప్తులో ఉంది. ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా” అని జోడీ థామస్ అన్నారు. అలాగే.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాభవాన్ని విస్తరించడం భారత్‌తో సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదం మెల్లగా పరిష్కారమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు.
కాగా, గతేడాది జూన్ 18న కొలంబియాలోని సర్రేలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హతమయ్యాడు. దీని వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలు వచ్చిన వెంటనే, నిజ్జర్ హత్యలో అధికారిక ప్రభుత్వ పాత్రను భారతదేశం ఖండించింది. అదే సమయంలో, రెండు దేశాలు పరస్పరం రాయబారులను బహిష్కరించాయి. అలాగే, కెనడా తన దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోవాలని న్యూఢిల్లీ కోరడంతో సెప్టెంబర్‌లో భారతదేశం నుండి 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 27, 2024 | 09:15 PM