Mega Star Chiranjeevi: జిమ్‌లో చిరంజీవి వర్కౌట్స్.. ట్రెండింగ్ మెగాస్టార్!

Mega Star Chiranjeevi: జిమ్‌లో చిరంజీవి వర్కౌట్స్.. ట్రెండింగ్ మెగాస్టార్!

ABN
, ప్రచురణ తేదీ – ఫిబ్రవరి 01 , 2024 | 11:36 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా కోసం ఓ ట్రైనర్ సమక్షంలో జిమ్ లో కసరత్తు చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mega Star Chiranjeevi: జిమ్‌లో చిరంజీవి వర్కౌట్స్.. ట్రెండింగ్ మెగాస్టార్!

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా, మెగా ఫాంటసీ అడ్వెంచర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పర్వదినం నాడు ఖరారు చేసి విశ్వంబర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఆ తర్వాత సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ దక్కడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడంతో గత నాలుగు రోజులుగా మెగాస్టార్ ఈ హడావిడిలో ఉండాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆ హంగామా సద్దుమణగడంతో చిరంజీవి నిత్య జీవితంలో బిజీ అయిపోయారు. విశ్వంభర సినిమాపై ఫోకస్ పెట్టి షూటింగ్ సంబంధిత కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈరోజు (గురువారం) చిరంజీవి జిమ్‌లో ట్రైనర్ సమక్షంలో కసరత్తు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది చూసి మెగాస్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చిరంజీవి సినిమా కోసం చేస్తున్న కష్టాన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి మెగాస్టార్ అవుతారని, అవార్డులు వస్తాయని కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 01, 2024 | 11:55 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *