వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమకథా చిత్రం రాధా మాధవం. ఈ చిత్రానికి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాల ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.

రాధా మాధవం ట్రైలర్ లాంచ్
గ్రామీణ ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. ఎందుకంటే అవి సహజమైనవి. త్వరలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే ‘రాధా మాధవం’. వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమకథా చిత్రం రాధా మాధవం. ఈ చిత్రానికి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాల ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూస్తుంటే ఓ అందమైన ప్రేమకథలా అనిపిస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. హీరో, దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. (రాధా మాధవం ట్రైలర్ లాంచ్)
చిత్ర నిర్మాత గోనల్ వెంకటేష్, హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ.. హీరో శ్రీకాంత్ మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫిబ్రవరిలో మా సినిమా రాబోతోంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి విజయం సాధించాలని కోరుకుంటున్నాం అన్నారు. మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌కి ధన్యవాదాలు. సినిమా నిర్మాణంలో నిర్మాత ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే సినిమా విడుదల కానుంది. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు దర్శకుడు ఇస్సాకు.
ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… నేటి సమాజంలో పరువు హత్యల ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు సాంకేతికంగా భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. ఇంకా కులాలు, మతాల గురించి పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈ కుల తగాదాలు, పరువు హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ‘రాధా మాధవం’ కూడా ఓ పల్లెటూరిలో ప్రేమికుల మధ్య జరిగే కథే. కుల గొడవల మధ్య ఇద్దరు ప్రేమికులు ఎలా నలిగిపోతారు అనే పాయింట్ తో స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. (రాధా మాధవం ట్రైలర్ టాక్)
ఇది కూడా చదవండి:
====================
*నంది అవార్డులు: నంది అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
****************************
*మృణాల్ ఠాకూర్: ఆ హీరోతో నాకు అవకాశం రానందుకు చాలా బాధగా ఉంది..
*******************************
*ధీర: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ అవుతుంది
*******************************
*సైంధవ్: ‘సైంధవ్’ OTT విడుదల తేదీలో చిన్న మార్పు.. ఎప్పుడు విడుదల చేస్తారు?
****************************
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 01, 2024 | 06:57 PM