వ్యవసాయ శాఖకు 1.27 లక్షల కోట్లు!

వ్యవసాయ శాఖకు 1.27 లక్షల కోట్లు!

ABN
, ప్రచురించిన తేదీ – ఫిబ్రవరి 02 , 2024 | 04:05 AM

బడ్జెట్‌లో కేంద్రం రూ. 1,27,469.88 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇందులో వ్యవసాయ శాఖకు రూ.1,17,528.79 కోట్లు, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (డేర్)కి రూ.9,941.09 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగం

వ్యవసాయ శాఖకు 1.27 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బడ్జెట్ లో కేంద్రం రూ. 1,27,469.88 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇందులో వ్యవసాయ శాఖకు రూ.1,17,528.79 కోట్లు, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (డేర్)కి రూ.9,941.09 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఎరువుల విషయంలో కీలక అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఇప్పటికే వివిధ రకాల పంటలకు ‘నానో యూరియా’ను ప్రవేశపెట్టినట్లుగానే తాజాగా ‘నానో డీఏపీ’ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నానో యూరియా విజయవంతమైన నేపథ్యంలో ‘నానో డీఏపీ’ని దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ వాతావరణ మండలాలకు విస్తరించనున్నారు. రసాయనాలు-ఎరువుల శాఖకు 1.68 లక్షల కోట్లు కేటాయించారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఆ శాఖలోని ఎరువుల శాఖకు 1,88,947.81 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.1,64,150.81 కోట్లకు తగ్గడం గమనార్హం. అయితే, ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి మాత్రం నిధులు పెంచలేదు. గత బడ్జెట్‌లో మాదిరిగానే ఈ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 11.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది. 2022లో ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ ఆయిల్ అభియాన్’లో భాగంగా ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు విత్తనాలలో అధిక దిగుబడి కోసం విత్తన రకాలపై పరిశోధనలను ప్రోత్సహిస్తామని పేర్కొంది. నూనెగింజల సాగులో ఆధునిక సాగు పద్ధతులు, మార్కెట్ అనుసంధానం, పంటల బీమా తదితర అంశాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. పాడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. పశుసంవర్ధక-డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు కేటాయించారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 02, 2024 | 04:05 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *