రాజకీయ నేతలు ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి కాబట్టి, వారు అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా సరైన పద్ధతులను అనుసరిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు.
రాజకీయ నేతలు ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి కాబట్టి, వారు అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా సరైన పద్ధతులను అనుసరిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు. అతనికి కోవిడ్‌తో పాటు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో… ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటున్నారని తెలిసింది. ఇంతకీ.. ఆ మాజీ సీఎం ఎవరనుకుంటున్నారా? అశోక్ గెహ్లాట్ తప్ప మరెవరో కాదు.
కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అశోక్ గెహ్లాట్ ఇటీవల ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. కోవిడ్‌తో పాటు స్వైన్ ఫ్లూకు పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయన్ను సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికపై వెల్లడించారు. ‘‘గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్యుల సలహా మేరకు శుక్రవారం పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షలో కోవిడ్, స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాను. ఇందుకోసం నేను ఏడు రోజుల పాటు ఎవరినీ కలవలేను’ అని ట్వీట్ చేశాడు. అలాగే.. మారుతున్న ఈ వాతావరణంలో మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని అశోక్ గెహ్లాట్ ప్రజలకు సలహా ఇస్తున్నారు.
శుక్రవారం రాత్రి జ్వరం, ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో అశోక్ గెహ్లాట్ ఆస్పత్రిలో చేరినట్లు సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 03, 2024 | 10:10 PM