సిద్ధరామయ్య: పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే కఠిన చర్యలు: సీఎం

సిద్ధరామయ్య: పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే కఠిన చర్యలు: సీఎం

ABN
, ప్రచురించిన తేదీ – ఫిబ్రవరి 28 , 2024 | 05:01 PM

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారన్న బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సిద్ధరామయ్య: పాక్ అనుకూల నినాదాలు నిజమని తేలితే కఠిన చర్యలు: సీఎం

బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారన్న బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉందని, దేశవ్యతిరేక నినాదాలు నిజమని తేలితే ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. మంగళవారం రాత్రి బెంగళూరు నగర పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు విధానసౌధలో కాంగ్రెస్ మద్దతుదారులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని ఆరోపిస్తూ కర్ణాటక అసెంబ్లీ వెలుపల బీజేపీ మద్దతుదారులు నిరసనకు దిగారు. పాకిస్థాన్ అనుకూల నినాదాల ఘటనపై బీజేపీ కూడా విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర స్పందిస్తూ.. పోలీసులు టీవీ చానెళ్ల నుంచి వీడియో ఫుటేజీని సేకరించి తదుపరి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

నాకు తెలియదు..

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగానే రాజకీయ భవనంలో నాసిర్ వెనుక ఓ వ్యక్తి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను హుస్సేన్ ఖండించారు. ఆయన అనుచరులు కేవలం నసీర్ సాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని అన్నారు. ఇంటికి వెళుతుండగా ఓ మీడియా సంస్థ నన్ను పిలిచి పాకిస్థాన్ అనుకూల నినాదాల గురించి అడిగారు. నేను గుంపు మధ్యలో ఉన్నాను. అలాంటి నినాదాలేవీ వినలేదు. దీనిపై అధికారులు విచారణ జరుపుతారని హుస్సేన్ చెప్పారు.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 28, 2024 | 05:01 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *