తన ప్రియతమతో కలిసి జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్.. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును జరుపుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్.. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును జరుపుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కేక్ కట్ చేసి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో సీమా హైదర్ భర్త సచిన్, ఆమె నలుగురు పిల్లలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె విడుదల చేసింది.
ఆ వీడియోలో సీమా హైదర్.. నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చారని కొనియాడారు. చివర్లో ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. 30 ఏళ్ల సీమా హైదర్ ఇటీవల రక్షాబంధన్‌కు ముందు ప్రధానికి రాఖీని పంపారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు కూడా రాఖీలు పంపారు.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా హైదర్ 2019-20లో గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్‌ను ఆన్లైన్ PUBG గేమ్ ద్వారా కలుసుకున్నారు. సచిన్‌తో కలిసి జీవించేందుకు ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి గత మేలో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఇద్దరూ కొంతకాలంగా రబూపురా ప్రాంతంలో రహస్యంగా నివసించారు. జులై 4న పోలీసులు అరెస్ట్ చేయగా.. 7న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఆమె పాకిస్థాన్ మహిళ కావడంతో స్థానిక పోలీసులు, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆ కోణంలో వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-17T20:14:22+05:30 IST