ఇకపై అలా చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటుంది ప్రభాస్ ‘కల్కి’ టీమ్.

ప్రభాస్ కల్కి 2898 AD నిర్మాతలు లీకర్లకు హెచ్చరిక నోట్‌ను విడుదల చేశారు
కల్కి 2898 AD : ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా తీస్తున్నప్పుడు, సినిమా నుండి ఏమీ బయటకు రాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఎంత తీసుకున్నా… ఏదో ఒక రకంగా బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలోని ఓ పిక్ లీక్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్న కంపెనీ నుంచి పిక్ లీక్ అయిందని చిత్ర బృందం సీరియస్ అయింది. వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.
జాతీయ సినిమా దినోత్సవం : మల్టీప్లెక్స్‌లలో రూ.99తో సినిమా.. కానీ ఆంధ్ర, తెలంగాణల్లో..
లీకైన పిక్‌ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అలాంటి వారికి వార్నింగ్ ఇస్తూ కల్కి మూవీ టీమ్ ఓ నోట్ కూడా రిలీజ్ చేసింది. సినిమాకు సంబంధించిన పిక్స్, వీడియోలు, ఫుటేజీలు ఇలా ఏదైనా షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్ర యూనిట్ నోటీసును విడుదల చేసింది. ఇప్పుడు ఈ నోట్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శర్వా35 : కృతిశెట్టికి జన్మదిన శుభాకాంక్షలు.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..
చట్టపరమైన కాపీరైట్ నోటీసు: #వైజయంతీ మూవీస్ అని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు #కల్కి2898AD మరియు దాని అన్ని భాగాలు కాపీరైట్ చట్టాల ద్వారా రక్షించబడతాయి. సినిమాలోని ఏదైనా భాగాన్ని, అది దృశ్యాలు, ఫుటేజ్ లేదా చిత్రాలను పంచుకోవడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైనది. అవసరమైన మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం… pic.twitter.com/wc3rRfRuDJ
— వైజయంతీ మూవీస్ (@VyjayanthiFilms) సెప్టెంబర్ 21, 2023
ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో వైజయంతీ మూవీ బ్యానర్‌పై సి అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి పెద్ద తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించినా.. ఆ తర్వాత విడుదల చేయడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.