బీసీసీఐ: ఐపీఎల్ కంటే ముందు రంజీలపై దృష్టిపెట్టండి.. వారికి బీసీసీఐ వార్నింగ్

బీసీసీఐ: ఐపీఎల్ కంటే ముందు రంజీలపై దృష్టిపెట్టండి.. వారికి బీసీసీఐ వార్నింగ్

ABN
, ప్రచురణ తేదీ – ఫిబ్రవరి 12, 2024 | 01:28 PM

చాలా మంది భారతీయ ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందా? తమ ఆదేశాలను పాటించనందుకు కోపమా? రంజీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై కొందరు ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

బీసీసీఐ: ఐపీఎల్ కంటే ముందు రంజీలపై దృష్టిపెట్టండి.. వారికి బీసీసీఐ వార్నింగ్

చాలా మంది భారతీయ ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందా? తమ ఆదేశాలను పాటించనందుకు కోపమా? రంజీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై కొందరు ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు దేశవాళీ రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది. రంజీ ట్రోఫీలో పాల్గొనకుండా ఐపీఎల్ 2024కి సిద్ధమవుతున్న ఇషాన్ కిషన్ సహా కొంతమంది ఆటగాళ్లను బీసీసీఐ పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం. “జాతీయ జట్టులో లేని ఆటగాళ్లందరూ రాబోయే రోజుల్లో రంజీ ట్రోఫీలో తమ తమ రాష్ట్ర జట్లకు ఆడాలని BCCI తెలియజేసింది. NCAలో గాయాల నుండి కోలుకుంటున్న ఆటగాళ్లకు మాత్రమే BCCI ఆర్డర్ నుండి మినహాయింపు ఉంది. మిగిలిన వారు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాల్సి ఉంటుంది” అని వివిధ నివేదికలు తెలిపాయి.

జనవరి నుండి ఐపీఎల్ మూడ్‌లో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది, అయితే పేర్లు స్పష్టంగా లేవు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రంజీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ సూచించింది. అయితే రంజీలను పక్కన పెట్టి ఇప్పటి నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నారు. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసం బరోడాలో శిక్షణ తీసుకుంటున్నారు. గత దక్షిణాఫ్రికా టూర్ నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా ఆడడం లేదు. అసలు కిషన్ ఎందుకు ఆడటం లేదనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొత్తంమీద, సాంప్రదాయ రంజీ లీగ్‌ల కంటే ఎక్కువ లాభదాయకమైన T20 లీగ్‌కు వారి ప్రాధాన్యత అనేక చర్చలకు దారితీసింది. రంజీల్లో ఆడడం ద్వారా ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తమ సత్తా చాటవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 12, 2024 | 01:28 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *