కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) SI, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 SI (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలు ఉన్నాయి.
1. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): 143 పోస్టులు
2. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్): 1315 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా కొన్ని భౌతిక ప్రమాణాలు ఉండాలి. పురుషులకు 165 సెం.మీ, స్త్రీలకు 155 సెం.మీ ఎత్తు ఉండాలి.
వయో పరిమితి: 25 జనవరి 2023 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతాలు: ASI పోస్టుకు నెలకు రూ.29,200- రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు రూ.25,500- రూ.81,100
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డిటైల్డ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు పరీక్ష రుసుము నుండి మినహాయింపు ఉంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. హిందీ/ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, కడ్ కుర్నూలు, గుంటూరు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 4
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25
CBT అడ్మిట్ కార్డ్ విడుదల: ఫిబ్రవరి 15
పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 22-28
వెబ్‌సైట్: https://crpf.gov.in/
నవీకరించబడిన తేదీ – 2022-12-31T12:15:03+05:30 IST