ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC)లో VIII తరగతి (2024 జనవరి టర్మ్) అడ్మిషన్ల కోసం వెబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్థానిక బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, వైద్య పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుండి 1 జనవరి 2024 నాటికి 7వ తరగతి ఉత్తీర్ణులైన/చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల వయస్సు పదకొండున్నర నుంచి పదమూడేళ్ల మధ్య ఉండాలి.
రాత పరీక్ష: మొత్తం మార్కులు 400. ఇంగ్లిష్ నుంచి 125 మార్కులకు, గణితం నుంచి 200 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు హిందీ లేదా ఆంగ్ల మాధ్యమంలో సమాధానాలు రాయవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి వైవా వోసీ నిర్వహిస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. తెలివితేటలు, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలను ఇందులో పరీక్షిస్తారు. ఇందులో కూడా అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుమును చెల్లించిన తర్వాత, RIMC దరఖాస్తు ఫారమ్, ప్రాస్పెక్టస్ మరియు పాత ప్రశ్నపత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతుంది. విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలతో పాటు APPSC చిరునామాకు పంపాలి.
దరఖాస్తు రుసుము: సాధారణ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 555
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఏప్రిల్ 15
అప్లికేషన్‌తో జతచేయవలసిన పత్రాలు: మునిసిపల్ కార్పొరేషన్/గ్రామ పంచాయతీ జారీ చేసిన జనన ధృవీకరణ; నివాసం, కుల రుజువులు; బోనాఫైడ్ సర్టిఫికేట్; ఆధార్ కార్డ్; విద్యార్థి ఫోటోలు 2
చిరునామా: అసిస్టెంట్ సెక్రటరీ (పరీక్షలు), AP పబ్లిక్ సర్వీస్ కమిషన్, కొత్త హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండవ అంతస్తు, RTA ఆఫీస్ దగ్గర, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, MG రోడ్, విజయవాడ- 520010, ఆంధ్రప్రదేశ్
పరీక్ష తేదీ: జూన్ 3
పరీక్ష కేంద్రం: విజయవాడ
వెబ్‌సైట్: www.rimc.gov.in
నవీకరించబడిన తేదీ – 2023-02-17T14:41:14+05:30 IST