భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ‘సెలక్షన్ పోస్టుల’ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 5369 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు పోస్టుల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్‌లు: ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కామ్. – ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ మొదలైనవి.
అర్హత: పోస్ట్ మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ విద్య, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయస్సు: 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ టెస్ట్/కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. కనీస అర్హతలు (మెట్రిక్యులేషన్), ఇంటర్మీడియట్ (హయ్యర్ సెకండరీ), డిగ్రీ ఆపై అర్హత సాధించిన అభ్యర్థుల ఆధారంగా మూడు రకాల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు బహుళ ఎంపిక విధానంలో ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ విభాగాల నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. తప్పుగా గుర్తించబడిన ప్రతి సమాధానానికి 0.50 మార్కు తీసివేయబడుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు రుసుము: రూ.100
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27
ఆన్‌లైన్ చెల్లింపు చివరి తేదీ: మార్చి 28
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023 జూన్-జూలై
వెబ్‌సైట్: https://ssc.nic.in/
ఇది కూడా చదవండి: ఉచిత బీర్ ఆఫర్: రెండు బీర్లు ఉచితం అంటూ పట్టణమంతా పోస్టర్లు వెలిశాయి.
నవీకరించబడిన తేదీ – 2023-03-08T12:12:00+05:30 IST