నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు

చివరిగా నవీకరించబడింది:

TREIRB: నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.

TREIRB: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు

TREIRB: నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.

నిరుద్యోగులకు శుభవార్త..

నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 9,231 పోస్టులు ఉన్నాయి. మొత్తం 9,231 పోస్టులకుగానూ బోర్డు విడివిడిగా 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు.. (టీఆర్‌ఈఐఆర్‌బీ)

డిగ్రీ కాలేజీల్లో 868 ఫ్యాకల్టీ, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

జూనియర్ కాలేజీల్లో 2,008 లెక్చరర్లు, 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను పాఠశాలల్లో భర్తీ చేయాల్సి ఉంది.

ఈ నెల 12 నుంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్, 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.

వివిధ సంక్షేమ పాఠశాలల్లో వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వయోపరిమితి, విద్యార్హత తదితర వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 4,020 ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

పే స్కేల్ రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు ఉంటుంది.

డిగ్రీ కాలేజీల్లో మొత్తం 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీతం రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది.

అలాగే జూనియర్ కాలేజీల్లో 2008 పోస్టులు ఉన్నాయి. జీతం రూ. 54,220 నుండి 1,33,630.

మొత్తం 1,276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి.

పోస్టులకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వేతనం ఉంటుందని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *