నీట్ యూజీ: రేపు నీట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ విషయాలను మర్చిపోవద్దు

నీట్ యూజీ: రేపు నీట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ విషయాలను మర్చిపోవద్దు

neet

NEET UG: నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను పెన్ మరియు పేపర్ విధానంలో.. 13 భాషల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

అభ్యర్థులు వీటిని మర్చిపోకూడదు (NEET UG)

నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపు పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను పెన్ మరియు పేపర్ విధానంలో.. 13 భాషల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను మరువవద్దని అధికారులు సూచిస్తున్నారు. అన్నది ఒకసారి చూద్దాం.

> పరీక్షకు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీనితోపాటు పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి.

> అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలి. పొడవాటి చేతుల దుస్తులు, బూట్లు, నగలు మరియు మెటల్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.

> బూట్లు, ఎత్తైన చెప్పులు ధరించవద్దు. తక్కువ ఎత్తు ఉన్నవాటినే వాడాలి.

> పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్‌లు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేల్స్, రైటింగ్ ప్యాడ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు మొదలైనవాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

> చేతి గడియారాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు మొదలైన వాటిని ధరించవద్దు.

> మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, పేజర్లు, హెల్త్ బ్యాండ్లు, స్మార్ట్ వాచీలు వంటి కమ్యూనికేషన్ పరికరాలను లోపలికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకెళ్లవద్దు.

> పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు పరీక్ష హాలులోనే బాల్ పాయింట్ పెన్ను అందజేస్తారు.

 

పోస్ట్ నీట్ యూజీ: రేపు నీట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ విషయాలను మర్చిపోవద్దు మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *