ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎంఆర్) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తారు. ఫైర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులు 02/2023 (నవంబర్ 23) బ్యాచ్‌లో INS చిల్కాలో శిక్షణ పొందుతారు. అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్: అగ్నివీర్ (మెట్రిక్ రిక్రూట్-MR): 100 ఖాళీలు (పురుషులు-80, స్త్రీలు-20)
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 1 నవంబర్ 2002 – 31 ఏప్రిల్ 2005 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులకు 157 సెం.మీ., మహిళలకు 152 సెం.మీ. ఉండాలి
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (CBE), వ్రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PFT) మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
శిక్షణ: ఫైర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థులకు కోర్సు శిక్షణ వచ్చే ఏడాది నవంబర్‌లో ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
జీతాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30,000, ద్వితీయ సంవత్సరంలో రూ.33,000, తృతీయ సంవత్సరంలో రూ.36,500, నాల్గవ సంవత్సరంలో రూ.40,000 అందజేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 50 మార్కులు కేటాయించారు. సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అమలులో ఉంది. తప్పుగా గుర్తించిన నాలుగు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.550
అప్లికేషన్: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: మే 29
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ, ఫీజు చెల్లింపు: జూన్ 15
శిక్షణ ప్రారంభం: నవంబర్ 2023
వెబ్‌సైట్: ww-w.joinindiannavy.gov.in/