తంగళన్: విక్రమ్ ‘తంగళన్’ ఎంత వరకు వచ్చింది..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-06T17:38:26+05:30 IST

చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తంగళన్’ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని విక్రమ్ తన ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.

తంగళన్: విక్రమ్ 'తంగళన్' ఎంత వరకు వచ్చింది..

చియాన్ విక్రమ్ మరియు మాళవిక మోహనన్

చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగళన్’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేకర్స్ వెల్లడించారు. మొత్తం 118 రోజుల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ మంగళవారంతో ముగిసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా విక్రమ్, మాళవిక తమ పాత్రల వేషధారణలో ఉండగా, దర్శకుడు రంజిత్ వారితో కలిసి ఉన్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు.

కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్-కేజీఎఫ్) నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటిష్ హయాంలో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ, బంగారు గనుల్లో పనిచేసిన కార్మికులపై దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తన సొంత నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు. పా.రంజిత్ సొంత బ్యానర్ నీలం ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (తంగళన్ షూటింగ్ ముగిసింది)

Vikram.jpg

ఈ మధ్య కాలంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్న జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విక్రమ్ ట్వీట్ చేశాడు. ‘ఈ సినిమా కోసం 118 రోజులు గొప్ప వ్యక్తులతో పనిచేశా. ఈ సినిమా అద్భుతమైన అనుభవాలను ఇచ్చింది. కొత్త ప్రపంచంలో గడిపినట్లు అనిపించింది.’

*******************************************

****************************************

*******************************************

*******************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-07-06T17:38:26+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *