స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ పి బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.

చంద్రముఖి 2లో కంగనా రనౌత్
స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (రాఘవ లారెన్స్) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (చంద్రముఖి 2). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (కంగనా రనౌత్) ప్రధాన పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందించి పేరు తెచ్చుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు పి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ జానర్‌లో కొత్త సంచలనం సృష్టించిన చంద్రముఖికి సీక్వెల్‌గా ఇప్పుడు చంద్రముఖి 2 రూపొందుతోంది. ఈ చిత్రం నుండి కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. (చంద్రముఖిగా కంగనా రనౌత్)
ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే… కంగనా చీరలో షార్ప్ గా కనిపిస్తోంది. చంద్రముఖిగా ఆమె లుక్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. కంగనా లుక్ లారెన్స్ రీసెంట్ లుక్ లానే ఉందని చెప్పొచ్చు. 2005లో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. దానికి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ రానుంది.
భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘చంద్రముఖి 2’ వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంథోని ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. అందులో భాగంగానే పాత్రలను పరిచయం చేస్తున్నారు. కంగనా రనౌత్ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్ ట్రెండింగ్ లో ఉంది.
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-08-05T11:40:24+05:30 IST