టిఎస్‌ఆర్‌టిసి: ఆర్‌టిసి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ టిఎస్‌ఆర్‌టిసి కార్మికులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు.

టిఎస్‌ఆర్‌టిసి: ఆర్‌టిసి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ టిఎస్‌ఆర్‌టిసి కార్మికులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు.
TSRTC బంద్

బంద్‌కు టిఎస్‌ఆర్‌టిసి పిలుపు: ఆర్‌టిసి బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో టిఎస్‌ఆర్‌టిసి కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో శనివారం రెండు గంటల పాటు బస్సులు నిలిపి వేయాలని కార్మికులు నిర్ణయించారు. ఆయా డిపోల ఎదుట బస్సులను నిలిపివేసి బైఠాయించారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం లభించింది.

అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ గవర్షర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుంటే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హెచ్చరించింది.

బండి సంజయ్: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ముంచేస్తాడు: బండి సంజయ్

ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్టీసీలోని 43 వేల 373 కుటుంబాలకు కేసీఆర్ వెలుగులు తెస్తుంటే.. గవర్నర్ మాత్రం చీకట్లు కమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ జీవితాల్లో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరారు. లేని పక్షంలో ఆర్టీసీ కార్మికులంతా కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అవసరమైతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

KTR: TSRTC ప్రభుత్వంలో విలీనం… తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదించాలని రాష్ట్రం భావిస్తోంది. అయితే ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసం పంపింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు గవర్నర్ తన సమ్మతిని తెలియజేయాలి. అయితే రెండు రోజుల నుంచి గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *