100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లను హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు.
బుద్వేల్ భూముల వేలం: గ్రేటర్ హైదరాబాద్ నలుమూలలా విస్తరిస్తోంది. నగరంలోని అన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగరానికి దక్షిణంగా ఉన్న బుద్వేల్.. భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేరాఫ్ గా మారనుంది. బుద్వేలిలో 100 ఎకరాలను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. కోకాపేట నియోపోలీస్ వేలానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు అందరి దృష్టి బుద్వేల్ పై పడింది.
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మౌలిక వసతుల కల్పనలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిన గ్రేటర్ నగరం శివారు ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ రూపొందించిన లేఅవుట్‌లకు ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కోకాపేట నియోపోలీస్‌లో ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బుద్వేలిలో మరో వంద ఎకరాల భూమిని వేలం వేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించడంతో క్రేజ్ పెరిగింది.
100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లను హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. 3.47 ఎకరాల నుండి 14.33 ఎకరాల వరకు విస్తీర్ణంలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చిక్కులు లేకుండా 100 శాతం క్లియర్ టైటిల్ తో ప్రభుత్వ భూమి కావడం, బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కావడంతో బుద్వేల్ అందరి దృష్టిని ఆకర్షించింది. 36 మీటర్లు, 45 మీటర్ల రోడ్లు నిర్మించారు. ఈ లేఅవుట్ నుండి మీరు విమానాశ్రయానికి 15 నిమిషాల్లో మరియు నియోపోలిస్‌కు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కోకాపేట్ నియోపోలిస్‌లోని మౌలిక సదుపాయాలతో సమానంగా సౌకర్యాలను అందిస్తుంది. బుద్వాల్ లేఅవుట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోలైన్ మార్గంలో ఉంది.
ఇది కూడా చదవండి: అందరి చూపు కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే ఏమిటి?
బుద్వేల్ లేఅవుట్ నమోదుకు ఈ నెల 8 చివరి తేదీ. ఈ నెల 9లోగా డిపాజిట్ చెల్లించాలి. ఈ నెల 10న వేలం నిర్వహించనున్నారు. ఈ నెల 10న రెండు సెషన్లలో వేలం నిర్వహించనున్నారు. ప్లాట్ నెం. 1, 2, 4, 5, 8, 9, 10లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలం వేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11, 12, 13, 14, 15, 16, 17 నంబర్ ప్లాట్‌లకు వేలం నిర్వహిస్తారు. ఒక్కో ప్లాట్ ధర ఎకరానికి రూ.20 కోట్లు. కనీస బిడ్ ఇంక్రిమెంట్ రూ.25 లక్షలు.
ఇది కూడా చదవండి: కోకాపేట మీమ్స్.. ఒక్క అడుగు భూమి ఉందంటూ జోకులు.. నవ్వించే మీమ్స్
బుద్వేల్ బెంగళూరు జాతీయ రహదారిపై ఉంది కాబట్టి కనెక్టివిటీ సమస్య లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీ హబ్, మరో వైపు ఎలక్ట్రానిక్ సిటీ, దగ్గర్లోనే శ్రీశైలం హైవే… అందరికీ అన్ని విధాలా అందుబాటులో ఉండే ప్రాంతంగా బుద్వేల్ చెప్పుకోవచ్చు. ఓటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో పాటు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగిస్తున్నారు. ఉపాధి, విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నందున మధ్యతరగతి వర్గాలకు నివాస ప్రాంతంగా అందుబాటులోకి వస్తుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.