ఢిల్లీ సర్వీసెస్ బిల్లు: ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు: ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-07T22:23:58+05:30 IST

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా, అనుకూలంగా 131 ఓట్లు నమోదయ్యాయి. రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా, బిల్లు ఆమోదానికి 119 ఓట్లు అవసరం.

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు: ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 102 ఓట్లు రాగా, అనుకూలంగా 131 ఓట్లు నమోదయ్యాయి. రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా, బిల్లు ఆమోదానికి 119 ఓట్లు అవసరం. 131కు పైగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపనుంది.

అంతకుముందు రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ ఓటింగ్ మిషన్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. స్లిప్‌ల ద్వారా ఈ ఓటింగ్‌ నిర్వహించారు. అధికార ఎన్డీయే కూటమికి బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, విపక్ష కూటమి ‘ఇండియా’కు బిల్లుకు వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ చట్టంగా మారనుంది.

ఆప్ ఎంపీ రాజీవ్ చద్దా సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఈ బిల్లును సవరించాలని ప్రతిపాదనలు చేశారు. ప్రతిపక్ష ఎంపీలు 70కి పైగా సవరణలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. సవరణలకు అనుమతి లేకుండా చాలా మంది ఎంపీల సంతకాలను రాజీవ్ చద్దా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనిపై సభా హక్కుల కమిటీతో విచారణ జరిపించాలని షా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

నవీకరించబడిన తేదీ – 2023-08-07T22:27:13+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *