ప్రొ పంజా లీగ్ 2023: రన్నరప్‌గా కిరాక్ హైదరాబాద్.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్ 28-30 స్కోరుతో కొచ్చి కేడిస్ చేతిలో ఓడిపోయింది.

ప్రొ పంజా లీగ్ 2023: రన్నరప్‌గా కిరాక్ హైదరాబాద్.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు

ప్రో పంజా లీగ్ 2023

కిరాక్ హైదరాబాద్ జట్టు: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్‌లో తెలుగు రాష్ట్ర జట్టు కిరాక్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. లీగ్ స్టేజ్ తో పాటు సెమీఫైనల్ లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు.. ఫైనల్లో టై బ్రేకర్ లో పట్టు కోల్పోయింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్ 28-30 తేడాతో కొచ్చి కేడిస్ చేతిలో ఓడిపోయింది. అండర్ కార్డ్, మెయిన్ కార్డ్ మ్యాచ్ ల అనంతరం ఇరు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. టై బ్రేకర్‌లో సత్తా చాటిన కొచ్చి తొలి సీజన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సీజన్‌లో అద్భుతంగా పోరాడి రన్నరప్‌గా నిలిచిన ఫ్రాంచైజీ యాజమాన్యం హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లను నేదురుమల్లి గౌతంరెడ్డి, సీఈవో త్రినాథ్ రెడ్డి అభినందించారు.

ప్రో పంజా లీగ్ 2023

ప్రో పంజా లీగ్ 2023

హోరాహోరీ అండర్ కార్డ్ మ్యాచ్‌లు..

అండర్ కార్డ్ మ్యాచ్ లు హోరాహోరీగా సాగాయి. ఇరు జట్లు సమంగా నిలిచాయి. పురుషుల 60వ తొలి మ్యాచ్‌లో ఎంవీ నవీన్ 0-1తో రుద్ర నాయక్ చేతిలో ఓడిపోయాడు. అయితే స్పెషల్ కేటగిరీ మ్యాచ్‌లో బుట్టా సింగ్ 1-0తో కొచ్చి ఆర్మ్ రెజ్లర్ ఆసిఫ్ అహెమ్‌ను ఓడించాడు. మహిళల 53 కేజీల మ్యాచ్‌లో సవితా కుమారి 1-0తో అభిరామిని ఓడించి కిరాక్ హైదరాబాద్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించింది. అండర్‌కార్డ్‌పై జరిగిన చివరి 100 కేజీల బౌట్‌లో జగదీశ్ 0-1తో ప్రిన్స్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఇరు జట్లు 2-2తో అండర్ కార్డ్ రౌండ్‌ను ముగించాయి.

ప్రో పంజా లీగ్ 2023

ప్రో పంజా లీగ్ 2023

చివర్లో తడబాటు..

మెయిన్ కార్డ్ లోనూ హైదరాబాద్ కు శుభారంభం లభించలేదు. కిరాక్ హైదరాబాద్ స్టార్ ఆర్మ్ రెజ్లర్ మధుర తొలి 65 కేజీల మ్యాచ్‌లో చేతన శర్మ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయింది. ఫలితంగా హైదరాబాద్ 2-7తో వెనుకబడింది. అనంతరం జరిగిన పురుషుల 70 కేజీల బౌట్‌లో స్టీవ్ థామస్ 10-0తో ఆకాష్ కుమార్‌ను ఓడించి హైదరాబాద్‌కు 12-7 ఆధిక్యాన్ని అందించాడు. కానీ, జిన్సీ జోస్ 65 ప్లస్ కేజీల విభాగంలో యోగేష్ చౌదరి చేతిలో 0-10 తేడాతో ఓడిపోవడంతో కొచ్చి 17-12తో ఆధిక్యంలో నిలిచింది. కీలకమైన 80 కేజీల బౌట్‌లో హైదరాబాద్ కెప్టెన్ అస్కర్ అలీ 10-0తో ప్రిన్స్ ధీర్‌ను చిత్తు చేసి 22-17తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత, 90 కేజీల బౌట్‌లో సిద్ధార్థ్ మలాకర్ 5-0తో కొచ్చి ఆర్మ్ రెజ్లర్ అక్బర్ షేక్‌ను ఓడించి కిరాక్ హైదరాబాద్‌కు 27-17తో పది పాయింట్ల ఆధిక్యాన్ని అందించాడు. కానీ, ఫైనల్ ప్లస్ 100 కేజీల బౌట్‌లో ఉజ్వల్ అగర్వాల్ 0–10తో మజాహిర్ సైదు చేతిలో ఓడి స్కోరును 27–27తో సమం చేశాడు.

టై బ్రేకర్‌లో బోల్తా..

విజేతను నిర్ణయించే టై బ్రేకర్‌లో కిరాక్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిక్స్‌డ్ వెయిట్ కేటగిరీ అరంగేట్రంలో స్టీవ్ థామస్ 1-0తో రుద్ర నాయక్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో కెప్టెన్ అస్కర్ అలీ 0-1తో ముజాహిర్ చేతిలో ఓడిపోయాడు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మధుర 0–1తో చేతన శర్మ చేతిలో, జిన్సీ జోస్ 0–1తో యోగేష్ చౌదరి చేతిలో ఓడిపోవడంతో హైదరాబాద్ ట్రోఫీని కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *