భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

ఎంఎస్ ధోని-తలపతి విజయ్
ధోని సినిమా అరంగేట్రం : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. దేశం తరఫున రెండు ప్రపంచకప్‌లు (2007 T20, 2011 ODI) గెలిచిన ఏకైక కెప్టెన్. అతను సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ రోజు (ఆగస్టు 15, 2020) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
తాజాగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు ధోనీ, అతని భార్య సాక్షి. LGM పేరుతో ఓ సినిమా నిర్మించారు. మైదానంలో సిక్సర్లతో అలరించే మహేంద్ర వెండితెరపై నటుడిగా ఎప్పుడు అడుగుపెడతాడో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎల్‌జీఎం సినిమా ప్రమోషన్స్‌లో ధోనీ భార్య సతీమణి సాక్షిని ఈ విషయమై ప్రశ్నించగా.. మంచి కథతో అన్నీ కుదిరితేనే సాధ్యమవుతుందని చెప్పింది.
Leo Movie : లియో నుంచి అర్జున్ ప్రోమో రిలీజ్.. రోలెక్స్ ఎంట్రీ రేంజ్ లో హెరాల్డ్ దాస్ ఎంట్రీ..
తాజాగా ధోని సినిమాల్లోకి వస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమాతో ధోని సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడనేది ఆ వార్తల సారాంశం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కెప్టెన్ కూల్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ వార్త విన్న సినీ ప్రియులతో పాటు క్రీడాభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్త నిజమైతే ధోనీ అభిమానులు సంతోషిస్తారు.
ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన లియో విడుదలకు సిద్ధంగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్ మరియు గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.