తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఈరోజు గోల్డ్ రేట్: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. కొద్దిరోజులుగా శుభ ముహుర్తాలు ఉండడంతో పలు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చాలా మంది మహిళలు శుభకార్యాలు, పండుగలు లేదా పెళ్లిళ్ల కోసం బంగారం కొంటారు. ఇటీవల శుభ ముహూర్తాలతో ఇళ్లలో శుభ కార్యక్రమాలు ఉన్న వారు బంగారం షాపుల వైపు చూస్తున్నారు. వారికి ఉపశమనం కలిగించేలా బంగారం ధరలు కూడా కాస్త తగ్గాయి.
ఇటీవలి కాలంలో బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఉదయం వరకు బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (22 క్యారెట్లు) రూ. 54,550 ఉంది. మంగళవారం కంటే రూ. 100 తగ్గింది. అదేవిధంగా పది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ. 59,510 ఉంది. మంగళవారం కంటే రూ.110 తక్కువ.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడల్లో కూడా బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550, అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,510.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ. 54,700, అదేవిధంగా 24 క్యారెట్లు రూ. 59,600. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000, అదేవిధంగా 24 క్యారెట్ల ధర రూ.60 వేలు. ముంబై, బెంగళూరు, కేరళ, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ. 54,550, అదేవిధంగా 24 క్యారెట్లు రూ. 59,510 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో కిలో వెండి ధర రూ. 76,000. అయితే బంగారం, వెండి ధరలు మాత్రం ఉదయం 6 గంటల వరకు నమోదయ్యాయి. స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.