తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయకుమార్ తన ఇద్దరు కూతుళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తన కుమార్తెల్లో ఒకరైన జోవిక ఎంట్రీకి సర్వం సిద్ధమైందని తెలిపింది.
వనిత విజయ్‌కుమార్ తన కూతురు జోవికతో కలిసి
తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయకుమార్ తన ఇద్దరు కూతుళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విజయ్ నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో తెరంగేట్రం చేసిన వనిత విజయ్ కుమార్ ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఆమె పెళ్లిళ్లు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల సీనియర్ నరేష్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో వివాదాస్పద పాత్రను పోషించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. కొన్నాళ్లుగా కోలీవుడ్‌లో ఆమె పరిస్థితి బాగా లేదు. అందుకే.. ఇప్పుడు కూతురిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తన కూతురు సినిమా ఎంట్రీకి సంబంధించి ఆమె చెప్పిన మాటలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వనితా విజయ్ కుమార్ ఏమన్నారంటే..
నా కూతురు జోవికను సినిమాల్లోకి పరిచయం చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. ఏ హీరో సరసన పరిచయం అవుతుందనేది ముఖ్యం కాదు. మంచి పాత్ర ద్వారా పరిచయం చేయాలనేది నా ఉద్దేశం. జోవికా సినిమా అరంగేట్రం గురించి త్వరలో శుభవార్త రానుంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ప్రీతి జింటా, హృతిక్ రోషన్ వంటి వారు నటనలో శిక్షణ పొందిన ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే జోవికా కూడా శిక్షణ పొందింది’ అని తెలిపారు. ఇదిలా ఉంటే విజయ్ ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన వనిత ఇప్పుడు తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేసే పనిలో పడింది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
==============================
*******************************************
****************************************
*******************************************
*******************************************
నవీకరించబడిన తేదీ – 2023-08-25T21:27:25+05:30 IST