తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి రూ. 200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200కి చేరింది.
బంగారం, వెండి ధర నేడు: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. దీంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. గత నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఆగస్టు మొదటి వారం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మధ్యలో ధరలు పెరిగినా నామమాత్రంగానే ధరలు పెరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.54,450, రూ. 250 పెరిగింది. దీంతో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670కి చేరింది.
బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670.
దేశవ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధరను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 54,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,820.
– ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670.
– చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 55,200 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220కి చేరింది.
– బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670 కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి రూ. 200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 80,200కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ. 77,100, బెంగళూరు రూ. 75,750, ముంబై రూ. 77,100, చెన్నై రూ. 80,200.
హైదరాబాద్‌లో గత పది రోజులుగా బంగారం ధరలు..