నేడు బంగారం ధర: తగ్గిన బంగారం ధర..! తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత?

నేడు బంగారం ధర: తగ్గిన బంగారం ధర..!  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత?

భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో, కిలో వెండి రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర…

నేడు బంగారం ధర: తగ్గిన బంగారం ధర..!  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత?

బంగారం ధర

నేడు బంగారం, వెండి ధరలు: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో పసిడి ప్రియులకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పతనమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనేందుకు ఇదే మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 150 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన ధర వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 కొనసాగుతోంది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490.
– ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ. 1000 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 79,000. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో కిలో వెండి రూ. 75,200 కాగా చెన్నైలో 79,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,500 ముంబైలో రూ. 75,200. అయితే ఇవి బుధవారం ఉదయం నమోదైన ధరలు మాత్రమే. ధరలు మారవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *