జీతాలు పెంచడంతోపాటు వీఓఏలు చేస్తున్న డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్: రాఖీ పండుగ సందర్భంగా వీఓఏలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలలో పనిచేస్తున్న వీఓఏలకు వేతనాలు పెంచుతూ ఐకేపీ నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగ కానుకగా వారి వేతనాలను 8 వేలకు పెంచారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘం కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాపై 106 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ : కేసీఆర్ పై కమల వ్యూహం, గజ్వేల్ లో ఈటల, కామారెడ్డిలో విజయశాంతి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వీఓఏలు గ్రామాల్లోని పొదుపు సంఘాలకు సహాయకులుగా పనిచేస్తున్నారు. సంబంధిత సొసైటీకి సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారం నోట్‌బుక్‌లో నమోదు చేస్తారు. ఆయా మహిళా సంఘాలు గ్రూపు లీడర్ కు నెలకు కేవలం రెండు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే పొదుపు సంఘాల మహిళలను సంఘటితపరిచి వారికి అవగాహన కల్పించి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వీఓఏల కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 3000 రూపాయల గౌరవ వేతనం అందజేస్తోంది. దీంతో పాటు మహిళా సంఘాలు రెండు వేలు అందజేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేవి, మహిళా సంఘాలు ఇచ్చేవి కలిపి ఇప్పటి వరకు మొత్తం 5000 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీరి వేతనం 8 వేలకు పెరిగింది. పెరిగిన ఈ వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి రానున్నాయి.
Bandi Sanjay Fires on CM KCR : నటనలో కేసీఆర్‌ను మించిన వారు లేరని బండి సంజయ్ మండిపడ్డారు.
జీతాలు పెంచడంతోపాటు వీఓఏలు చేస్తున్న డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీఓఏలకు యూనిఫాం నిధులు ఇవ్వడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి అమలు చేస్తున్న రెన్యూవల్ విధానాన్ని సవరించి ఏడాదికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీఓఏలకు రైతుబీమా లాంటి జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సీఎం కేసీఆర్ స్పందిస్తూ సంబంధిత విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీఓఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.