షారూఖ్ వర్సెస్ సమీర్ : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి పరోక్ష కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

షారూఖ్ వర్సెస్ సమీర్ : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి పరోక్ష కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

జవాన్‌లో షారుఖ్ ఖాన్ డైలాగ్‌కు పరోక్ష కౌంటర్ ఇస్తూ సమీర్ వాంఖడే ఆంగ్ల కోట్‌ను పంచుకున్నారు.

షారూఖ్ వర్సెస్ సమీర్ : షారుఖ్ ఖాన్ డైలాగ్‌కి పరోక్ష కౌంటర్ ఇచ్చిన సమీర్ వాంఖడే..

షారుఖ్ ఖాన్ జవాన్ డైలాగ్‌కి సమీర్ వాంఖడే కౌంటర్

షారుఖ్ ఖాన్ వర్సెస్ సమీర్ వాంఖడే: షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌లో షారుక్ చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “నా కొడుకు మీద చేయి వేయకముందే. వాడి బాబుపై చేయి వేయండి అంటూ షారుక్ చెప్పిన డైలాగ్ మాజీ డ్రగ్స్ నిరోధక అధికారి సమీర్ వాంఖడేకు సందేశం ఇవ్వడంతో అభిమానులు ఆ డైలాగ్ ను వైరల్ చేశారు. ఇక ఈ విషయం సమీర్ వాంఖడే వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

జైలర్: జైలర్ విజయంతో ఖుషీలో ఉన్న నిర్మాత.. రజనీకి చెక్కు, బీఎండబ్ల్యూ కారు..

తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో ఓ ఇంగ్లీష్ కోట్ షేర్ చేశారు. “నేను నిప్పును తాకను. మండే బూడిదలో డ్యాన్స్ చేశాను. నాకు నరకం అంటే భయం లేదు, ”అని అతను కోట్‌ను పంచుకున్నాడు. షారుక్‌కి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ సమీర్ వాంఖడే ఈ కోట్‌ను షేర్ చేశాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యల్లో సమీర్ వాంఖడేను ప్రస్తావిస్తూ షారుక్ అభిమానులు ‘యు టచ్డ్ ద ఫైర్ షారుఖ్’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

వరుణ్ – లావణ్య : జిమ్‌లో వరుణ్, లావణ్య వర్క్ అవుట్స్.. వైరల్!

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కోసం జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన మాజీ యాంటీ డ్రగ్స్ అధికారి సమీర్ వాంఖడే. జవాన్ విషయానికి వస్తే… అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *