శనివారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ హల్చల్ చేస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’…

శనివారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఇందులో పవన్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఖాకీ చొక్కా, చారల లుంగీ కట్టుకుని రక్తం మరకలున్న కత్తిని పట్టుకుని కనిపించాడు. ఈ నెల 5 నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఓజి’. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ని యూనిట్ విడుదల చేసింది. అర్జున్‌దాస్ వాయిస్ ఓవర్‌తో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన విధానం, ఎస్.థమన్ నేపథ్య సంగీతం, స్టైలిష్ సినిమాటోగ్రఫీ ఆద్యంతం కళ్లు చెదిరేలా ఉన్నాయి. ‘ఓజీ’ కొత్త షెడ్యూల్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రియాంక మోహన్ కథానాయిక. అర్జున్‌దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్‌రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత.
-
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. రెడ్ డ్రెస్ లో పవన్ కళ్యాణ్ సీరియస్ గా కనిపించాడు. ఈ చారిత్రక చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఎం రత్నం దర్శకత్వంలో ఎ దయాకర్ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-03T01:29:39+05:30 IST