ఈరోజు బంగారం ధర: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత?

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది.

ఈరోజు బంగారం ధర: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత?

గోల్డ్ రేట్

బంగారం, వెండి రేటు నేడు: గత నెల ప్రారంభం వరకు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. మధ్యలో మాత్రం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడం, పెళ్లిళ్ల సీజన్ తో పాటు వరుస పండుగలు రావడంతో బంగారం ధర కాస్త పెరిగింది. బంగారం దుకాణాలు సైతం కిటకిటలాడాయి. అయితే గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం ధర ఔన్సుకు 1919 డాలర్ల మార్కుకు పడిపోయింది. వెండి ధర 23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి ధరల్లో మార్పులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

బంగారం

బంగారం

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గింది. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల వద్ద కొనసాగుతోంది.

బంగారం

బంగారం

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,200 కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55 వేలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేలు.

బంగారం

బంగారం

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 500 తగ్గింది. బుధవారం కిలో వెండి రూ.79,000. గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం కిలో వెండి రూ. 78,500. మూడు రోజుల్లో వెండి ధర రూ. 1500 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో కిలో వెండి రూ. 74,700. బెంగళూరులో రూ. 73,750, చెన్నైలో రూ. 78,500, ముంబైలో రూ. 74,700.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *