‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ‘జితేందర్ రెడ్డి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
జితేందర్ రెడ్డి
‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. 1980 నాటి పీరియాడికల్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా.. తెలంగాణ నేపథ్యంలో జరిగే యదార్థ సంఘటనల ఆధారంగా సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.
టైటిల్ లుక్‌ని విడుదల చేసిన దేవకట్టా.. కాన్సెప్ట్ గురించి అడిగి చిత్ర యూనిట్‌ని అభినందించి సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. గత రెండు చిత్రాలను ప్రేమకథా చిత్రాలతో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విరించి వర్మ.. ఈసారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. (జితేందర్ రెడ్డి టైటిల్ లుక్ పోస్టర్ అవుట్)
ఈ సినిమాలో హీరో ఎవరనేది త్వరలో ప్రకటించనున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్‌లుక్‌ని త్వరలో మీడియాతో పంచుకుంటామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా.. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి.
==============================
*************************************
*************************************
*************************************
*************************************
*************************************
నవీకరించబడిన తేదీ – 2023-09-09T20:39:47+05:30 IST