చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబును జైలుకు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబును పోలీసులు తరలించారు. రాజమండ్రి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు జైలులోని స్నేహ బ్లాక్‌లో చంద్రబాబు కోసం ప్రత్యేక గదిని అధికారులు కేటాయించారు. ఖైదీ నంబర్ 7691 కేటాయించబడింది. దాదాపు 300 మంది పోలీసులతో జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు హోరెత్తాయి. చిత్తూరి జిల్లా నగరిలో మంత్రి రోజా తన నివాసంలో పటాకులు పేల్చి వైసీపీ కార్యకర్తలకు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు తప్పులన్నీ చేశారని రోజా విమర్శించారు. మరికొందరు వైసీపీ నేతలు.. ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లుబాటు కాదన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ నాయకత్వం బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం తెల్లవారు జాము నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. అయితే ఎక్కడికక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 రాజకీయంగా చంద్రబాబుకు చివరి సంవత్సరం అని అంటున్నారు. దీనికి గల కారణాన్ని కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఈ సంఖ్యను బట్టి ఇది చంద్రబాబు రాజకీయ జీవితానికి ఏడాది అని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన ట్వీట్ ప్రకారం.. ‘చంద్రబాబు ఖైదీ నంబర్ 7691… 7+6+9+1 = 23 చంద్రబాబు.. 2023 మీ చివరి సంవత్సరం. 2024 సంవత్సరం నుండి మీరు రాజకీయ తెరపై కనిపించరు. మీ మామగారు ఎంత బాధపడ్డారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.