అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ #MissShettyMrPoliShetty గత వారం విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది. నవీన్ పొలిశెట్టి ఒక్కడే ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని ప్రతి ఊరు వెళ్లి తన సినిమాను స్వయంగా ప్రమోట్ చేసుకున్నాడు.
మొదటి నుండి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క శెట్టి బయటకు రాలేదు. ఎందుకో అందరికీ తెలుసు. అయితే ఆమె వెండితెరపై కనిపించింది సినిమాలో మాత్రమే. మామూలుగా అయితే ఏ షూటింగ్ జరిగినా ఫోటోలు లీక్ అవుతాయి కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు అనుష్క, నవీన్. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్‌లో మాత్రమే పాల్గొన్న అనుష్క ఒక్కసారి కూడా పబ్లిసిటీ కోసం బయటకు రాలేదు. కొందరికే ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సమంతకు ఓ విచిత్రమైన వ్యాధి సోకినప్పుడు సుమ కనకాల ఆమెను సంప్రదించి ‘యశోద’ సినిమా కోసం సమంతను ఇంటర్వ్యూ చేసింది. అన్ని మీడియాలకు ఆ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సుమ కనకాల, అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి ఓ వీడియో ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియో ఇంటర్వ్యూ బయటకు తీసుకురాలేదు.
ఆ వీడియో ఇంటర్వ్యూకి గ్రాఫిక్స్ కూడా అవసరమని భావించి గ్రాఫిక్ కంపెనీని అడిగితే.. ఈ అరగంట ఇంటర్వ్యూకు దాదాపు రూ.50 లక్షలు అడిగారని తెలిసింది. అది భారీ మొత్తమని, అంతే కాకుండా అసలు వీడియో ఇంటర్వ్యూని విడుదల చేయవద్దని అనుష్క చివరి నిమిషంలో రిక్వెస్ట్ చేయడంతో ఇంటర్వ్యూ మొత్తాన్ని విడుదల చేయకుండా నిలిపివేశారు. సినిమాలో చాలా సీన్లలో గ్రాఫిక్స్ వాడిన సంగతి తెలిసిందే..కానీ వీడియో ఇంటర్వ్యూకి కూడా గ్రాఫిక్స్ ఉపయోగించాలని అనుకున్నారు కానీ అలా కాదు.
నవీకరించబడిన తేదీ – 2023-09-12T14:58:18+05:30 IST