ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు పార్టీలు విజృంభించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఓడిపోయిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయడం వల్ల అధికార పార్టీ వైసీపీకి నష్టం తప్పదని అందరూ స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కంటే టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లు చాలా లెక్కలు చెబుతున్నాయి.
ఉదాహరణకు, 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 73,207 ఓట్లు వస్తే, టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోగా, వైసీపీ తరపున అమర్‌నాథ్‌రెడ్డి 8 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి 66,141, టీడీపీకి 60,290, జనసేనకు 18,807 ఓట్లు వచ్చాయి. దీంతో పేర్ని నాని విజయం సాధించారు.
అటు నగరి నియోజకవర్గంలో వైసీపీకి 80,333 ఓట్లు రాగా, టీడీపీకి 77,625 ఓట్లు వచ్చాయి. పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈ సీటును బీఎస్పీకి కేటాయించింది. బీఎస్సీకి 3,044 ఓట్లు వచ్చాయి. చివరకు రోజా సెల్వమణి 2,708 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి 58,435, టీడీపీకి 50,764, జనసేనకు 22,367 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి గెలిచి ఉండేవారు. కానీ వైసీపీకి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ 7 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 1,05,063, టీడీపీకి 84,187, జనసేనకు 9,279 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో రెండు పార్టీలు ఓడిపోయాయి. దీంతో అంబటి రాంబాబు విజయం సాధించారు. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీకి 75,040 ఓట్లు రాగా, టీడీపీకి 73,052 ఓట్లు, జనసేనకు 5,503 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. తణుకు, శ్రీకాకుళం, భీమిలి, అమలాపురం, పెడన, భీమవరం, తాడేపల్లి గూడెం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
ఇది కూడా చదవండి:
నవీకరించబడిన తేదీ – 2023-09-15T18:52:04+05:30 IST