తెలంగాణ: పార్టీ గుర్తు బెంగాల్ టైగర్.. ఎన్నికల గుర్తు సింహం.. క్యూ కట్టిన రెబల్స్!

తెలంగాణ: పార్టీ గుర్తు బెంగాల్ టైగర్.. ఎన్నికల గుర్తు సింహం.. క్యూ కట్టిన రెబల్స్!

బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు రాని పలువురు ఆశావహులు ఇప్పటికే సింహాన్ని పార్టీ గుర్తుగా పెట్టుకోవాలని చర్చించుకుంటున్నారు.

తెలంగాణ: పార్టీ గుర్తు బెంగాల్ టైగర్.. ఎన్నికల గుర్తు సింహం.. క్యూ కట్టిన రెబల్స్!

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన ఆరెపల్లి మోహన్ సోమారపు సత్యనారాయణ

తెలంగాణ-ఫార్వర్డ్ బ్లాక్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ) టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రధాన పార్టీల నుంచి అవకాశం రాని వారంతా ఫార్వర్డ్ బ్లాక్ టిక్కెట్లపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల గెలుపుపై ​​ప్రభావం చూపుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ఫార్వర్డ్ బ్లాక్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు రాని పలువురు ఆశావహులు ఇప్పటికే సింహం చిహ్నాన్ని పొందాలని మాట్లాడుతున్నారు.

మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఆయన ఎన్నికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ త్వరలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. చొప్పదండి బీజేపీ టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య వరుసలో ఉన్నట్లు సమాచారం. ఈ పార్టీ నుంచి రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కమలం నేతల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు పోటీగా బీఆర్‌ఎస్‌ నాయకురాలు, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బ్లాక్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటారం సింగిల్‌ విండో చైర్మన్‌ చల్లా నారాయణరెడ్డి, పెద్దపల్లి నుంచి నల్ల మనోహర్‌రెడ్డి సింహం గుర్తుపై బీఆర్‌ఎస్‌ రెబల్స్‌గా పోటీ చేయనున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఫార్వర్డ్ బ్లాక్ నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాకపోతే ప్రవీణ్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: మైనంపల్లి వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి.. ప్లాన్ బీ సిద్ధమా?

టికెట్ వస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్న నేతలు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోయినా.. సింహం గుర్తు మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా క్రేజ్ ఇస్తోంది. మూడు ప్రధాన పార్టీల పక్కన నిలబడింది. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటుతామని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అంటున్నారు.

ఇది కూడా చదవండి: షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! అదే కారణమా? షర్మిల ఏం చేస్తుంది?

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3 మే 1938న స్థాపించారు. పార్టీ గుర్తు బెంగాల్ టైగర్ అయితే, ఎన్నికల గుర్తు సింహం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ రెండు గుర్తులతో ప్రత్యర్థులను టెన్షన్ పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ కోసం సీటు పోయినా పర్వాలేదు: మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *