భారత్ vs ఆస్ట్రేలియా తొలి వన్డే: తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది.

భారత్ vs ఆస్ట్రేలియా తొలి వన్డే: తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది.

Ind vs Aus ఫస్ట్ ODI అప్‌డేట్‌లు మరియు తెలుగులో హైలైట్‌లు

డేవిడ్ వార్నర్ గట్టిగా ఆడుతున్నాడు

ఆస్ట్రేలియా 15 ఓవర్లలో 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ గట్టిగా ఆడుతున్నాడు. క్రీజులో స్టీవెన్ స్మిత్(21)తో పాటు డేవిడ్ వార్నర్(48) ఉన్నారు.

10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోర్ 42/1
ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (17)తో స్టీవ్ స్మిత్(17) ఆడుతున్నారు.

5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోర్ 19/1
ఆస్ట్రేలియా తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(1)తో స్టీవ్ స్మిత్(10) ఆడుతున్నారు.

ఆదిలోనే ఆసీస్‌కు షాక్
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. శుభమన్ గిల్ బౌలింగ్ లో మహ్మద్ షమీ పెవిలియన్ చేరాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నారు.

ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించింది
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా. ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ వచ్చారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తొలి ఓవర్‌లో 5 పరుగులు ఇచ్చాడు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి వన్డే: ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడు. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో ఉన్నాడు.

మరోవైపు ఆసియాకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా.. మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఎలాగైనా ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచి ప్రపంచకప్‌పై ఆత్మవిశ్వాసం పొందాలని భావిస్తోంది. మొహాలీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

జట్లు

భారతదేశం: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (w), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, ఆడమ్ జంపా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *