ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆట జరిగే ఆదివారం ఇండోర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వరుస విజయాలతో టీమ్ ఇండియా దూసుకుపోతోంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ఇండోర్‌లో జరిగే రెండో వన్డేలో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆట జరిగే ఆదివారం ఇండోర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలి వన్డే జరిగిన మొహాలీలో కూడా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కాసేపు వర్షం కురవడంతో అంపైర్లు పావుగంట పాటు మ్యాచ్‌ను నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: టీమ్ ఇండియా: మూడు ఫార్మాట్లలో నంబర్ వన్.. చరిత్రలో రెండో జట్టుగా రికార్డు
అలాగే ఆసియా కప్‌లో కూడా వర్షం కారణంగా చాలా మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. వరుణుడు కారణంగా లీగ్ దశలో భారత్-పాక్ మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత సూపర్-4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేలో జరిగింది. శ్రీలంకలోనే కాకుండా భారత్‌లో కూడా మ్యాచ్‌లను ఆపేందుకు వరుణుడు ప్రయత్నిస్తున్నాడని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రెండో వన్డే సజావుగా సాగితే.. భారత జట్టులో కోచ్ రాహుల్ ద్రవిడ్ కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదో నంబర్‌లో ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉండగా, ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడుతున్నాడు. కాబట్టి అతని స్థానంలో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్ అండ్ కో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-09-23T16:22:50+05:30 IST