ప్రభాస్: మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ బయటపడింది. అయితే దీనిపై నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు..

ప్రభాస్: మరో ప్రభాస్ మైనపు బొమ్మ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహానికి సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

ప్రభాస్: రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్‌ని గుర్తించిన లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అక్కడ బాహుబలి అవతార్‌లో మైనపు బొమ్మను ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ మైనపు బొమ్మ ఎక్కడ..?

హీరో సుమన్: చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ వ్యాఖ్యలు.. ఇదో గుణపాఠం..

ఈ కొత్త ప్రభాస్ బొమ్మను బెంగళూరులోని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ మైనపు బొమ్మ బాహుబలి అవతార్‌లో కూడా ఏర్పాటు చేయబడింది. ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ మైనపు బొమ్మను చూసి నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు అని మీరు ఆశ్చర్యపోతున్నారా? మైనపు విగ్రహం అసలు ప్రభాస్ లా కనిపించకపోవడమే కారణం. అసలు మైనపు బొమ్మ ప్రభాస్ అని గుర్తుపట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

పరిణీతి రాఘవ్ వెడ్డింగ్: పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా పెళ్లి వైరల్ అవుతోంది.

ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహానికి సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహానికి సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

దీంతో నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు ఆ బొమ్మను తీసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫిగర్ చూసిన మరికొందరు డేవిడ్ వార్నర్ లా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలికి శస్త్ర చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ట్రీట్ మెంట్ పూర్తవడంతో వచ్చేవారం ఇండియా వస్తాడని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రెండు వారాల పాటు షూటింగ్ కు బ్రేక్ తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *