సూర్య: అభిమాని మృతి.. సూర్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

అభిమాని మృతి చెందిన విషయం తెలియగానే సూర్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సూర్య: అభిమాని మృతి.. సూర్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

సూర్య అభిమానుల ఇంటిని సందర్శించి అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు

సూర్య: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. యాక్సిడెంట్ అయిందని అభిమానులకు తెలియగానే వెంటనే స్పందిస్తాడు. ఈ క్రమంలోనే విదేశాల్లో కాల్పుల ఘటనలో మరణించిన తెలుగు మహిళా అభిమాని కుటుంబ సభ్యులకు లేఖ రాసి వారికి సంతాపాన్ని తెలియజేశారు. తాజాగా సూర్య బర్త్ డే వేడుకల్లో ఓ అభిమాని విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

Nayanthara : నయనతార 50 సెకన్ల యాడ్ కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

ఆ విషయం తెలిసిన సూర్య వెంటనే కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఓదార్చాడు. ఇటీవల సూర్య అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వారి ఇంటికి వెళ్లి అభిమాని ఫోటోకి గిఫ్ట్ ఇచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సూర్యకు అభినందనలు తెలుపుతున్నారు.

జవాన్ : ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. ఇదేనా ఆఫర్?

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య యోధుడిగా నటిస్తున్నాడు. అంతేకాదు సూర్య మరికొన్ని పాత్రల్లో కూడా కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటిస్తుంది.

సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగుతో పాటు మొత్తం పది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *