మంచు విష్ణు: ‘కన్నప్ప’లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-30T15:14:03+05:30 IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిలాండ్ లో ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ఇందులో మరో ముఖ్య పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా హై బడ్జెట్ మూవీగా ఉండబోతోందని తెలుస్తోంది.

మంచు విష్ణు: 'కన్నప్ప'లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్

మంచు విష్ణు మరియు మోహన్ లాల్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ #కన్నప్ప సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం అందుతోంది. చిన్నగా మొదలైన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా మామూలుగా స్టార్ట్ అయినప్పటికి న్యూజిలాండ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి హై బడ్జెట్ మూవీగా, పాన్ ఇండియా మూవీగా మంచు విష్ణు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. దీనికి ‘మహాభారత్’ #మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.

prabhas-new2.jpg

విష్ణు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజువల్ వండర్ గా ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ #ప్రభాస్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ ఎంట్రీ ఇచ్చాడు. మాలీవుడ్ సూపర్ స్టార్ మరియు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా ‘కన్నప్ప’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు ఇటీవల మోహన్ లాల్ ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

vishnumanchu.jpg

ప్రస్తుతం ‘కన్నప్ప’ టీమ్ న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ అద్భుతంగా రూపొందించారని మంచు విష్ణు తెలిపారు. భవిష్యత్తులో మరింత సమాచారంతో ‘కన్నప్ప’పై అంచనాలు పెరగనున్నాయి.

నవీకరించబడిన తేదీ – 2023-09-30T15:14:03+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *