మంత్రి కేటీఆర్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ : మంత్రి కేటీఆర్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొంటారు.
Read Also : మంత్రి కేటీఆర్ : మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
మంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా..
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా వైరా చేరుకుంటారు. ఉదయం 8:40 గంటలకు కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మించనున్న ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక బీఆర్ ఎస్ నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంలోని మమత వైద్య కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. కళాశాల సమీపంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ మున్సిపల్ పార్కును ప్రారంభించనున్నారు. అమృత పథకం రెండో దశ కింద మంజూరైన రూ.250 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో రామచంద్రయ్య నగర్ మున్సిపల్ స్పోర్ట్స్ పార్కు, జయశంకర్ మున్సిపల్ పార్కు, గోళ్లపాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కులను ప్రారంభించనున్నారు.
మున్నేరు వరద నివారణకు కాలువ గట్టు వద్ద రూ.690 కోట్లతో నిర్మించనున్న కాంక్రీట్ గోడలు, అదేవిధంగా రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంత్రులు ఖమ్మం వీడియోస్ కాలనీకి చేరుకుని మున్సిపల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం రూ.100 కోట్ల ఖమ్మం నగరాభివృద్ధి నిధులు, రూ.20 కోట్ల ఎల్ ఆర్ ఎస్ నిధులతో చేపట్టనున్న పనులను కూడా మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మం ప్రగతి నివేదిక సభలో పాల్గొంటారు. ఖమ్మం అభివృద్ధిపై వీడియో చిత్రీకరించి చూపిస్తారు. అనంతరం మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సభ అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు.
భద్రాచలం నుంచి కూనవరం రోడ్డులో రూ.38 కోట్లతో గోదావరి వరద నివారణ పనులకు, భద్రాచలం పట్టణ అభివృద్ధికి సంబంధించిన రోడ్లు, ఎత్తిపోతల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 2:35 గంటలకు హెలికాప్టర్‌లో సత్తుపల్లి చేరుకుని రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం సత్తుపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.