టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆయన కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం ఢిల్లీలో లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కోర్టుల్లో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా ఇన్ని రోజులు జైల్లో ఉండడం బాధాకరమన్నారు.
తట్టుకోలేకపోయా..!
‘రాజమండ్రి జైలులో చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయాను. సీఎంగా ప్రారంభించిన బ్లాక్‌లోనే ఆయనను నిలబెట్టడం బాధాకరమన్నారు. చేయని తప్పుకు జైలుకు పంపితే ఇంకెవరైనా రాజకీయాల్లోకి వస్తారా..?. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలకు సేవ చేసేందుకు నీతిమంతులు రాజకీయాల్లోకి రారు. తెలుగుదేశం ఏనుగులాంటిది.. ఒక్కసారి పరుగెత్తడం మొదలుపెడితే ఆగదు. అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణకు ఆదేశిస్తాం. రెడ్ డైరీతో పాటు రెడ్ ఫోన్ కూడా రెడీ అవుతోంది. సైకో జగన్ ఆటలు ఎక్కువ కాలం సాగవు. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని.. జగన్ పట్ల ప్రజలు ఆకట్టుకుంటున్నారన్నారు‘ లోకేశ్ అన్నారు.
అది బాధిస్తుంది..!
‘చంద్రబాబుకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టే ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. నిరసనల్లో టీడీపీ కంటే సామాన్యులే ఎక్కువ. అన్ని వర్గాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఒక్క ఆధారం కూడా చూపకుండా చంద్రబాబును జైల్లో పెట్టడం నా మనసును బాధిస్తోంది. తండ్రి అరెస్ట్ తర్వాత ప్రజాగ్రహాన్ని చూసి సైకో జగన్ వణుకుతున్నారు. శాంతిభద్రతలను కాపాడుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని.. అందుకే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారసత్వ ఆస్తులు పెరిగాయి‘ లోకేష్ స్పష్టంగా చెప్పారు.
హాజరవుతున్నారు..!
సీఐడీ నోటీసులపై కూడా లోకేష్ తొలిసారి స్పందించారు. అక్టోబర్-04న సీఐడీ విచారణకు హాజరవుతానని యువనేత స్పష్టం చేశారు. సీఐడీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇస్తానని.. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి..? లోకేష్ అన్నారు. పొత్తుపై మాట్లాడుతూ.. త్వరలో టీడీపీ-జనసేన యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈరోజు అవనిగడ్డలో జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వాలని, మళ్లీ జగన్ కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సేనాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-01T20:54:06+05:30 IST