టీమిండియాతో కలిసి తిరువనంతపురం వెళ్లను: విరాట్ కోహ్లీ..! ముంబై ఎందుకు వెళ్లాడు?

నెదర్లాండ్స్‌తో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమిండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులో లేడు.

టీమిండియాతో కలిసి తిరువనంతపురం వెళ్లను: విరాట్ కోహ్లీ..!  ముంబై ఎందుకు వెళ్లాడు?

విరాట్ కోహ్లి జట్టు శిబిరం నుండి నిష్క్రమించాడు

విరాట్ కోహ్లి జట్టు శిబిరాన్ని విడిచిపెట్టాడు: దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ను గెలవాలని సగటు భారతీయ క్రీడాభిమాని కోరుకుంటున్నారు. ODI ప్రపంచ కప్ 2023లో తమ మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ముందుగా వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. గౌహతి వేదికగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ రద్దయింది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్ కోసం టీమిండియా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంది. అయితే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులో లేడు.

తొలి వార్మప్ మ్యాచ్ రద్దు కావడంతో మేనేజ్‌మెంట్ అనుమతితో విరాట్ కోహ్లీ ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్లే విరాట్ కోహ్లీ ముంబై వెళ్లినట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. విరాట్ కోహ్లీ సోమవారం మరోసారి టీమిండియాతో భేటీ కానున్నాడని సమాచారం.

రెండోసారి తల్లి కాబోతున్న అనుష్క..!

గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండో సారి ప్రసవించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ముంబైకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వామిక 2021 జనవరి 11న జన్మించారు.ఇదిలా ఉంటే త్వరలో విరుష్క జంట శుభవార్త ప్రకటించడం ఖాయం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌లు: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.

మంగళవారం తిరువనంతపురంలో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్‌కు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉంది. తొలి వార్మప్ మ్యాచ్ లాగానే రెండో మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌ల ద్వారా టీమిండియా ప్రాక్టీస్ సాధిస్తుందని భావిస్తే.. వరుణుడు అడ్డుగా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *