ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో ఏపీలోని జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో కుంభకోణం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బుధవారం ఉదయం విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పుతో కొంత ఊరట లభించిందని టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CID Enquiry : లోకేష్ విచారణ సమయంలో సీఐడీ అధికారులకు పదే పదే ఫోన్ చేసింది ఎవరు.. ఆ ‘ముక్క’ గురించే..!?
మరోవైపు ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు సమాచారం అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుతో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసును అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌ను నియమించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-11T15:13:08+05:30 IST