– త్వరగా బయటకు రావాలని అభ్యర్థనలు
– చౌడేశ్వరి, దుర్గామాత ఆలయాల్లో టెంకాయలు కొట్టిన ప్రవాసాంధ్రులు
బెంగళూరు/బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. యలహంకలోని శక్తి చౌడేశ్వరి ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చిన్నప్ప, ఖాదీ బోర్డు మాజీ సభ్యుడు పాపన్న చౌడేశ్వరీదేవికి పట్టుచీర సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. జైలు వాతావరణం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో పెనుకొండ టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, కేశవనాయుడు, పురుషోత్తం, ఓడీసీ బాబా, బాలాజీ, యోగానంద, రఘురాం, రామేశ్వర రెడ్డి, బోరెడ్డి రెడ్డెప్పారెడ్డి, సుధాకరరెడ్డి, బాలాజీ నాయుడు, అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా ‘చంద్రబాబు వెంట మేం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ అభిమానులు, తెలుగు ప్రజలు, కమ్మసంఘాలు, తెలుగు సంఘాల ప్రముఖులు శుక్రవారం బళ్లారిలోని దుర్గమ్మ అమ్మవారికి పూజలు చేశారు. ప్రదక్షిణలు చేసిన అనంతరం చంద్రబాబు పేరుతో అమ్మవారికి కుంకుమపూజలు, పాల అభిషేకాలు నిర్వహించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 34 రోజులు జైల్లో ఉంచి అమ్మవారి గుడి ముందు 34 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం నేరమని గుర్రం లాల్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకాలతో ప్రజాస్వామ్యం పోతుందని గురుప్రసాద్, కోనంకి రవి, వెంకటనాయుడు, ఆర్. జయరాం, కుడితిని రాము అన్నారు. కార్యక్రమంలో చింబిలి ప్రకాష్, వెంకటనాయుడు, రమేష్, కృష్ణంనాయుడు, కుడితి వెంకటేసులు, మోపిడి ఎర్రిస్వామి, ఎర్రిస్వామి, గిరిగెట్ల రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-14T08:13:46+05:30 IST